: ముందుంది.. సైబర్ యుద్ధమే: అబ్దుల్ కలామ్
సాంకేతికత అనూహ్యంగా మెరుగవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్ యుద్ధాలేనని శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాదులోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవంలో నేడు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే రక్షణ వ్యవస్థ తక్షణ కర్తవ్యం కావాలని కలాం సూచించారు. ప్రపంచదేశాలు అణ్వాయుధాలను తగ్గించుకుంటాయనే నమ్మకం తనకుందన్నారు. అణ్వాయుధాల రక్షణ సామాన్యవిషయం కాదని కలాం చెప్పారు.