: వైకాపా, తెరాస సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులను శాసనసభ స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే తెరాస, వైకాపాకు చెందిన సభ్యులు ఆందోళన ప్రారంభించారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో తెరాసకు చెందిన 13 మందిని, వైకాపాకు చెందిన 12 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు.