: ఎంతెత్తుకైనా... ఇట్టే తీసుకెళుతుందట!


ఎత్తైన భవనాల్లో పై అంతస్తుకు వెళ్లాలంటే... ఎలా? మెట్లెక్కి వెళ్లగలమా? ఏ మూడు నాలుగు అంతస్థులైతే వెళ్లగలమేమో... అదే పెద్దదైన పెట్రోనాస్‌ టవర్స్‌, లేదా షాంగై టవర్స్‌ లేదా బూర్జ్‌ ఖలిఫా భవంతి ఇలాంటి భవనాల్లో పై అంతస్తుకు చేరాలంటే... ఎలా... లిఫ్ట్‌ ఎక్కవచ్చు. అయితే ఇంతపెద్ద భవంతులకు లిప్ట్‌ ఏర్పాటు చేయాలంటే అంత పొడవైన స్టీలు తాడు కావాలి. అంత పొడవైన స్టీలు తాడంటే లిఫ్ట్‌ బరువు కూడా బాగా పెరుగుతుంది. దీంతో అంత బరువున్న లిఫ్ట్‌ను లాగాలంటే కరెంటు కూడా ఎక్కువే ఖర్చవుతుంది. అయితే దీన్ని నివారించేందుకు ఒక కొత్తరకం తాడును కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

ఎక్కువ ఎత్తున్న భవంతుల్లోకి వెళ్లేందుకు ఉపయోగించే లిఫ్ట్‌లను లాగేందుకు ఫిన్‌లాండ్‌కు చెందిన కోన్‌ అనే సంస్థ 'కార్బన్‌ ఫైబర్‌ రోప్‌'ను కనుగొంది. దీన్ని 'అల్ట్రారోప్‌'గా పిలుస్తున్నారు. ఈ కొత్తరకం తాడు ఆవిష్కరణ లిఫ్ట్‌ల నిర్మాణ రంగంలో ఒక విప్లవంగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ అల్ట్రారోప్‌ను పెట్రోనాస్‌ లేదా షాంగై లేదా బూర్జ్‌ ఖలిఫా ఇలా ఎంత పెద్ద ఎత్తైన భవంతులకైనా ఎంచక్కా లిఫ్ట్‌లో ఉపయోగించేయవచ్చు. సుమారు కిలోమీటరు దూరం ఉన్నా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. పైగా, ఈ కొత్తరకం తాడు వల్ల దూరం పెరిగేకొద్దీ లిఫ్ట్‌ బరువు కూడా తగ్గుతుందని, ఫలితంగా కరెంటు కూడా కాస్త ఆదా అవుతుందని చెబుతున్నారు దీన్ని తయారీదారులు.

  • Loading...

More Telugu News