: తెలుగు యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్ళు


ఉత్తరకాశీ యాత్రకు వెళ్ళి వరదల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురైన తెలుగు యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేయనుంది. డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీలకు నేరుగా రైళ్ళను ప్రకటించింది. అంతేగాకుండా, డెహ్రాడూన్, ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద తెలుగువారి సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, ఉత్తరకాశీలో చిక్కుకుపోయిన వారికోసం 12 సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్టు జాతీయ విపత్తుల నివారణ సంస్థ అధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వెల్లడించారు. హెలికాప్టర్ల సాయంతో కొందరిని రక్షించగలిగామని తెలిపారు.

  • Loading...

More Telugu News