: తెలుగుదేశం ఓ దొంగల పార్టీ: కన్నా


శాసనసభలో కళంకిత మంత్రుల వ్యవహారం పదేపదే లేవనెత్తుతూ, తమను చికాకు పెడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేడు విరుచుకుపడ్డారు. టీడీపీ ఓ దొంగల పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ నేతల చరిత్ర అంతా తన దగ్గర ఉందని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుతిన్నది టీడీపీ నేతలే అని ఆరోపించారు. జన్మభూమి, పనికి ఆహార పథకం, ఉపకారవేతనాలు, స్టాంపుల కుంభకోణం అన్నింటా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. సీబీఐ ఛార్జిషీటులో తన పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని, పత్రికల్లో పనిగట్టుకుని అవాస్తవాలు రాయిస్తున్నారని మంత్రి విమర్శించారు.

  • Loading...

More Telugu News