: మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ : వెస్టిండీస్ లక్ష్యం 260


మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్ ఉమెన్ శుభారంభం అందించారు. ఓపెనర్ లానింగ్ 31(41 బంతుల్లో ఆరు ఫోర్లు) పరుగులు చేసి అవుటవ్వగా మరో ఓపెనర్ హైనెస్(74 బంతుల్లో 52), కామెరోన్(76 బంతుల్లో 75) హఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా కామెరోన్ వెస్టిండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంది. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో హఫ్ సెంచరీ చేసింది.

అయితే, ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ ఉమెన్ ను వెస్టిండీస్ కుప్పకూల్చడంతో ఆసీస్ జోరుకు కళ్లెం పడింది. ఒక దశలో 209 పరుగులకే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ చివరిలో జోడీ ఫీల్డ్స్, పెర్రీ జోడీ చెలరేగడంతో మరో వికెట్ పడకుండా ఆసీస్ జట్టు 259 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో క్వింటైన్ మూడు వికెట్లు తీయగా, డాలే, స్మార్ట్, టేలర్, మహమూద్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News