: సెర్ప్ ఉద్యోగుల ఆమరణ దీక్ష
ఇందిరా క్రాంతి పథకంలో పనిచేస్తున్న 6553మంది హెచ్‌ఆర్‌పాలసీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉద్యోగులు రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) ఆధ్వర్యంలో ఈ దీక్ష జరుగుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేవరకూ దీక్ష కొనసాగుతుందని సెర్ఫ్ అధ్యక్షుడు నర్సయ్య మంగళవారం తెలిపారు.