: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కట్జూ రాజీనామాకు బీజేపీ పట్టు


కాంగ్రెసేతర ప్రభుత్వాలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. బాధ్యతాయుత పదవిలో ఉండి, రాజకీయ ప్రోద్భలంతో పనిచేస్తున్న కట్జూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై ఓ పత్రికలో కట్జూ రాసిన వ్యాసం రాజకీయ విద్వేషాలు చెలరేగేలా ఉందని ఆయన ఆరోపించారు. న్యాయమూర్తిగా ఏ పక్షానికి చెందకుండా తీర్పు చెప్పాలని, అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా ఉండాలని జైట్లీ అన్నారు.

  • Loading...

More Telugu News