: 'ట్వీట్'.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోకెక్కింది
ట్విట్టర్.. ఇప్పుడీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గురించి తెలియని విద్యావంతులు ఉండరంటే అతిశయోక్తికాదు. తమ అభిప్రాయాలను పదుగురితో పంచుకోవాలంటే ఇంతకుమించిన వేదిక లేదనేది నెటిజన్ల నిశ్చితాభిప్రాయం. అందుకే ట్విట్టర్ కు అంత ఫాలోయింగ్. మరి ట్విట్టర్ లో మనం పోస్ట్ చేసే ఒపీనియన్ ను 'ట్వీట్' అంటారని తెలిసిన విషయమే. ఇప్పుడా 'ట్వీట్' అనే పదం ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటు సంపాదించింది. నౌన్, వెర్బ్ పరంగా 'ట్వీట్' పదానికి అర్ధాన్ని పొందుపరిచారు. 'ట్వీట్' అనే పదం డిక్షనరీలో ఇంతకుముందే ఉన్నా.. దానికి 'ఓ రకం పక్షి పాడే పాట' అని అర్థం ఉండేది.