: డి.రాజాకు అన్నాడీఎంకే మద్దతు
రాజ్యసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డి.రాజాకు మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయించారు. తమ పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థిని ఉపసంహరించుకున్నట్టు జయలలిత ప్రకటించారు. ఈ ఉదయం జయలలితను రాజా కలిసి మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తాజా నిర్ణయం తీసుకుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి.