: కన్నాకు కోట్లెక్కడివి?: రాయపాటి


మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇన్ని కోట్లు ఎలా సంపాదించగలిగారని ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రశ్నించారు. తనను కన్నా విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. తానేమీ గుమాస్తాగా పనిచేయలేదని, పుట్టుకతోనే కోటీశ్వరుడిననీ అన్నారు. వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని చెప్పారు. రేకులషెడ్లలో ప్రస్థానం ప్రారంభించిన కన్నా కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టాడు? అని ప్రశ్నించారు. అవినీతి మంత్రి కన్నాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News