: అభిమానికి బిగ్ బీ ట్రీట్
ముంబైకి చెందిన జయశ్రీ శరాద్ అనే మహిళాభిమానిని అమితాబ్ అమితానందానికి గురిచేశారు. జయశ్రీ ఇటీవల గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసింది. మిత్రులు, తెలిసిన వారందరికీ ఆహ్వానం పలికింది. ఎంతగానో అభిమానించే అమితాబ్ ను పిలవాలనుకుని కాల్ చేసింది. ఆయన సరేనన్నారు. అయినా అమితాబ్ వస్తారన్న నమ్మకం జయశ్రీలో లేదు. కానీ, ఆడిన మాట తప్పడం తెలియని అమితాబ్... జయశ్రీ సహా ఆ పార్టీకి హాజరై అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి లోను చేశారు. గంటసేపు హడావిడి చేసి వారితో అమితాబ్ ఫొటోలు కూడా దిగారు. ఈ కార్యక్రమానికి సంజయ్ దత్ సోదరి, ఎంపీ ప్రియాదత్ కూడా హాజరయ్యారు.