: నడకతో 'తీపి' రోగానికి చెక్ పెట్టండి!
నడక చాలా మంచిది అని చాలామంది చెపుతూనే ఉంటారు. అయినా కూడా మరోసారి చెబుతున్నారు వైద్యులు. అందునా భోజనం చేసిన తర్వాత ఒక పదిహేను నిముషాల పాటు నడవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని, మధుమేహం రాకుండా నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. వయసు మీదపడిన వారికి భోజనానంతరం నడక వల్ల టైప్ 2 మధుమేహం రాకుండా కూడా నివారించేందుకు వీలవుతుందని ఈ తాజా అధ్యయనంలో తేలింది.
జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ సర్వీసెస్ (ఎస్‌పిహెచ్‌హెచ్‌ఎస్) కు చెందిన పరిశోధకులు అన్నం తిన్న తరువాత పదిహేను నిముషాల పాటు నడవడం వల్ల రక్తంలోని షుగర్ శాతం తగ్గుతుందని ఒక పరిశోధనలో కనుగొన్నారు. కాబట్టి, భోజనానంతర నడకను కూడా అలవాటు చేసుకోండి!