: ఎల్లుండి టీ.కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం


తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిన్న ఉదయం నుంచి మంత్రి జానారెడ్డితో పలువురు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు సమావేశమవగా, ప్రత్యేక రాష్ట్రమే వారి చర్చల అజెండా అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ నేతలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు జానారెడ్డి తెలిపారు. ఈ నెల 18న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ అంశంపై అధిష్ఠానం కూడా ఏదో ఒకటి తేల్చాలని సిద్ధమవుతుండగా, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టీ.కాంగ్రెస్ వర్గాలు తమవంతు ప్రయత్నాలు మొదలెట్టాయి.

  • Loading...

More Telugu News