: ఎయిరిండియా పరివారంలో కొత్త విమానాలు


జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా తన పాత ఎయిర్ బస్ ఎ-330 విమానాల స్థానంలో బోయింగ్ తయారీ 787 డ్రీమ్ లైనర్లను చేర్చుకోవాలని ఆశిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అత్యంత అధునాతన విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా భావిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో డ్రీమ్ లైనర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఇంధనం పెద్ద ఎత్తున ఆదా చేయవచ్చన్నది ఎయిరిండియా ఆలోచన. ఎ-330 విమానాల లీజు వచ్చే ఏడాది పూర్తవుతుందని, వాటి స్థానాన్ని 787 డ్రీమ్ లైనర్లతో భర్తీ చేస్తామని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News