: విశాఖలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్: సుబ్బిరామిరెడ్డి


ఇప్పటికే హైదరాబాద్ నగర వాసులకు సేవలందిస్తున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ త్వరలో విశాఖ నగరంలోనూ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి చెప్పారు. ఆపదలో ఉన్న వారికి వెంటనే రక్తం అందితే వారి ప్రాణాలు కాపాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకులు అవసరం నేడు ఎంతో ఉంది.  

అయితే, సుబ్బిరామిరెడ్డి పర్యవేక్షిస్తానంటే విశాఖలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చిరంజీవి ప్రకటించారు. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంకు స్థాపించిన చాలా కాలం తర్వాత రెండో కేంద్రాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విశాఖలో ఏర్పాటు చేయనుండడం విశేషం. 

  • Loading...

More Telugu News