: ఛాంపియన్స్ ట్రోఫీపై వరుణుడి పగ
ఛాంపియన్స్ ట్రోఫీపై వరుణుడు పగబట్టాడు. మొన్న కివీస్, ఇంగ్లాండ్, నిన్న సఫారీ, విండీస్ తాజాగా ఇండియా, పాక్ ఇలా జట్లన్నీ వరుణుడి బారినపడ్డవే. బర్మింగ్ హమ్ లో జరుగుతున్న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ను రెండు సార్లు వరుణుడు అడ్డుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 12 ఓవర్ల వరకూ ఆటంకం లేకుండా సాగింది దీంతో ఒక వికెట్ కోల్పోయి బ్యాట్స్ మన్ కుదురుకుని మంచి జోరుమీదున్న పాక్ కాస్త చిన్నబోయింది. చిన్నగా ప్రారంభమైన వాన పెరిగిపోయింది. తరువాత 7 ఓవర్లపాటు ఏ విధమైన ప్రభావం చూపని వర్షం మరోసారి ఝలకిచ్చింది. ఈసారి మూడువికెట్లు తీసి టీమిండియా మంచి జోరుమీదుంది. ఆట ఆపే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. అసద్ షఫీక్, మిస్బావుల్ హక్ క్రీజులో ఉన్నారు.