: జానారెడ్డిని కలిసిన టీ.నేతలు
చలో అసెంబ్లీ, తదనంతర బంద్ పరిణామాలను చర్చించేందుకు కాంగ్రెస్ తెలంగాణ నేతలు నేడు మంత్రి జానారెడ్డితో భేటీ అయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు జానాను కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ ముట్టడి విజయవంతం కావడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ అంశంపై దృష్టి సారించడం వంటి విషయాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.