: నేడే దాయాదుల పోరు... జరుగుతుందా?
ఛాంపియన్స్ ట్రోఫీలో అప్రాధాన్య హైటెన్షన్ మ్యాచ్ నేడే జరుగనుంది. పాకిస్థాన్, టీమిండియా మధ్య ఎడ్ బాస్టన్ లో పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ ఈ రోజు జరుగనుంది. దాయాదుల మధ్య పోరంటే సహజంగానే హైఓల్టేజీ ప్రవహిస్తుంది. రెండు జట్ల ఆటగాళ్లను తమ తమ దేశాలకు చెందిన వీర జవానులుగా భావిస్తారు. అది క్రీడా మైదానమని మర్చిపోతారు. తమే గెలవాలని కోరుకుంటారు. విపరీతమైన భావోద్వేగాలకు గురౌతుంటారు. అందుకే భారత్- పాక్ మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఎడ్ బాస్టన్ లో జరుగనున్న మ్యాచ్ కు అరగంటలోనే టికెట్లు అమ్ముడైపోయాయి. కానీ, పాక్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్ అప్రాధాన్యమైపోయింది. అయినప్పటికీ టోరీ హాట్ ఫేవరేట్ భారత్ పై నెగ్గితే తమ అవమానకర నిష్క్రమణ ప్రభావం పెద్దగా ఉండదని, ఒక్క భారత్ మీద గెలిస్తే టోర్నీ గెలిచినట్టేనని పాక్ బావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్ జరగడం అనుమానమే. ఇప్పటికే ఎడ్ బాస్టన్ లో భారీ వర్షం కురుస్తోంది.