: మూడు సంచుల నిండా నగదు
తెలంగాణ బంద్ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మూడు సంచుల నిండా భారీగా నగదు పట్టుబడింది. ఈ నగదుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు వివరాలు పోలీసులు ఇప్పటివరకూ బయటకు వెల్లడించలేదు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నగదు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంత పెద్దమొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి.