: దలైలామా తదనంతరం 'మహిళా లామా'!


దలైలామా తర్వాత వారసులుగా ఓ మహిళ దలైలామాగా రావొచ్చేమో... ఈ మాట ఎవరో చెప్పలేదు... టిబెట్‌ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు, నోబెల్‌ పురస్కార గ్రహీత దలైలామా స్వయంగా అన్నారు. తన తదనంతరం మహిళ తన వారసురాలిగా రావొచ్చేమోననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దలైలామా పదిరోజుల ఆష్ట్రేలియా పర్యటన కోసం మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. ఆష్ట్రేలియాలో ప్రస్తుతం లైంగిక వివక్ష వివాదం నడుస్తోంది. ఈ విషయాన్ని మీడియావారు దలైలామా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉంటే ఒక మహిళ దలైలామాగా ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అప్పుడు తనంతట తానే ఆమె దలైలామాగా రావొచ్చని అన్నారు.

లైంగిక వివక్ష గురించి దలైలామా మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, నిజానికి సమాజంలో పురుషులకన్నా మహిళలకే ఎక్కువ సామర్ధ్యం ఉందని, మిగిలిన వారికంటే మహిళలు చాలా సున్నిత స్వభావులని అన్నారు. నిజానికి తన విషయం వరకే తీసుకున్నా కూడా తన తండ్రి, తాను కూడా కొన్ని సమయాల్లో ఉద్రేకపడిన వారేనని, అయితే తన తల్లిమాత్రం తనకెప్పుడూ ఆశ్యర్యాన్ని కలిగిస్తుందని, ఆమె ఎప్పుడూ ఉద్రేకపడినది తాను ఎరుగనని, ఆమె ఒక గొప్ప ప్రేమమూర్తి అని ఆయన తన తల్లిని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News