: ఏడు కొండలను రెండు కొండలు చేస్తారా?: షర్మిలకు బీజేపీ ప్రశ్న


మరోసారి రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ వైసీపీ తరఫున షర్మిల చెబుతున్న మాటలపై బీజేపీ ప్రశ్నలతో దాడి చేసింది. రాజన్న రాజ్యం తీసుకొచ్చి, తిరుమల ఏడు కొండలను రెండు కొండలు చేద్దామనుకుంటున్నారా? ఉన్నదంతా దోచేద్దామనుకుంటున్నారా? అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.

బ్రదర్ అనిల్ కుమార్ మత సంస్థ కోసం మణికొండలో అక్రమంగా భూములు లాక్కున్నారని రైతులే స్వయంగా చెప్పినా చర్యలు తీసుకోలేదన్నారు. షర్మిల, ఆమె భర్త అనిల్ అక్రమ సంపాదనలు, 11 కంపెనీలలో పెట్టుబడులపై తాము వేసిన ప్రశ్నలకు వారు ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. వీరి అక్రమాస్తులపై సీబీఐతో విచారణ చేయించాలని మరోసారి డిమాండ్ చేశారు.

మానవత్వమే షర్మిల మతమైతే.. అనిల్ కుమార్ ను మతం మార్పించాకే ఎందుకు పెళ్లి చేసుకున్నారని ప్రభాకర్ నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పేరును వైఎస్సార్ క్రిస్టియన్ గా మార్చుకోవాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎంతో మందిపై వేధింపులకు పాల్పడిందన్నారు.

  • Loading...

More Telugu News