: రౌడీ పోలీస్ దాడి... మహిళ ఆసుపత్రి పాలు
ఓ పోలీసు అధికారి పేదమహిళను గాయపరిచాడు. విధినిర్వహణలో రౌడీలా ప్రవర్తించి ఖాకీకి అపఖ్యాతి తెచ్చిపెట్టాడు. గుంటూరు జిల్లా బాపట్ల సీఐ రామారావు స్థానిక మహిళపై చేసిన దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ కు అడ్డం వచ్చిందంటూ రోడ్డు మీద పూలమ్ముకునే మహిళను తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో ఆ మహిళ చేయివిరిగింది. దీంతో ఆమెను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు.