: ఛలో అసెంబ్లీలో కేసీఆర్ ఎక్కడ?: చీఫ్ విప్ జగ్గారెడ్డి
ఛలో అసెంబ్లీ విఫలమైందని ప్రభుత్వ చీఫ్ విప్ జగ్గారెడ్డి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం సక్సెస్ అయిందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన రేపటి బంద్ కూడా విఫలమౌతుందని తెలిపారు. ఛలో అసెంబ్లీకి మద్దతు ఇవ్వనట్టే రేపటి బంద్ కు కూడా ప్రజలు మద్దతివ్వరని అన్నారు. అసలు ఛలో అసెంబ్లీ ప్రధాన సూత్రధారి కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లో ఉంటూ తెలంగాణవాదులను ఉద్యమానికి బలిస్తున్నాడని మండి పడ్డారు. టీఆర్ఎస్ నేతలు పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.