: సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి: హైకోర్టు
బైండోవర్లు, అరెస్టుల విషయంలో ప్రత్యేకించి ఆదేశాలు జారీ చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపింది. చలో అసెంబ్లీ సందర్భంగా నిర్బంధాలు, అరెస్టులు తక్షణమే నిలిపివేయాలని, అరెస్టు చేసిన జేఏసీ ఉద్యమకారులను విడుదల చేయాలనే హౌస్ మోషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చేసింది.