: ఓయూలో టెన్షన్.. టెన్షన్


ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ జ్వాల భగ్గుమంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతుగా ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు వర్శిటీ గేట్ల వద్దే అడ్డుకున్నారు. దీంతో, ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు. పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసు బలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగించాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, ముళ్ళకంచెలను విద్యార్థులు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు ఆ యత్నాలను తిప్పికొట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News