: ఒక్క రబ్బరు బుల్లెట్ కూడా వాడొద్దు: సీఎం


ఛలో అసెంబ్లీ సందర్భంగా ఆందోళన కారులతో సంయమనంతో వ్యవహరించాలని కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఛలో అసెంబ్లీని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులను ముందుగానే రంగంలోకి దించిన కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా వాడొద్దని వారికి సూచించారు. ఆందోళన కారులను అడ్డుకోవడమే పని తప్ప వారిని గాయపరచడం ముఖ్యోద్దేశం కాకూడదని చెప్పారు. విజయవంతంగా ఛలో అసెంబ్లీని అణచివేస్తే కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్ఠానం వద్ద పలుకుబడి అమాంతం పెరుగుతుంది. తాజాగా డీఎల్ బర్తరఫ్ పై రాష్ట్రంలోని స్వపక్షంలోనే విపక్షం నేతల నుంచి అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎలాగైనా అమ్మగారి దగ్గర మార్కులు పడాలంటే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని పోలీసులను కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో ప్రతిపక్షాల దగ్గర్నుంచి విమర్శలు కూడా ఎక్కువ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

  • Loading...

More Telugu News