: నరేంద్ర మోడీ భస్మాసురుడు : జైరాం రమేష్


నరేంద్రమోడీ భస్మాసురుడులాంటి వాడని యూనియన్ మినిస్టర్ జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సృష్టించిన శివుడినే హరించేందుకు ప్రయత్నించిన భస్మాసురుడితో నరేంద్ర మోడీ సమానుడని, తనను తయారు చేసిన అద్వానీ స్థానాన్ని ఆశిస్తూ అతనికి పోటీగా తయారయ్యాడని విమర్శించారు. ఢిల్లీలో జైరాం రమేష్ మాట్లాడుతూ మోడీకి రాహుల్ గాంధీకి ప్రధానంగా ఉన్న తేడాలను వివరించారు. మోడీకి విధానాలపట్ల విశ్వాసం లేదని, తనకు విధానాలతో పని లేదని, తానే విధానమని బలంగా నమ్ముతాడన్న జైరాం, మోడీ లేకుండా బీజేపీ మనలేదన్నది అతని ప్రగాఢవిశ్వాసమని తెలిపారు.

రాహుల్ కి అలాంటి భావనలు ఉండవని దేన్నయినా అనుసరించగలడని తెలిపారు. రానున్న ఎన్నికలు మోడీకి- రాహుల్ కి మధ్య పోరాటం కాదని స్పష్టం చేశారు. మోడీని వ్యాపారవేత్తలంతా ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు హిట్లర్, ముస్సోలినీని పెట్టుబడి దారులే కోరుకున్నారని, ఐతే ప్రజలు ఎవర్ని కోరుకుంటే వారే పరిపాలిస్తారని జైరాంరమేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News