: సిరియా సంక్షోభంలో 93 వేల మంది చనిపోయారు
సిరియా సంక్షోభంలో ఇప్పటి వరకూ 93 వేల మంది వరకూ చనిపోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమేనన్న ఐక్యరాజ్యసమితి, వాస్తవానికి మరింత మంది చనిపోయి ఉంటారని అభిప్రాయపడింది. సిరియాలో 2011 మార్చి నుంచి 2013 ఏప్రిల్ వరకు జరిగిన పలు హింసాత్మక సంఘటనల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.