: వాయుసేన చెంతకు 'గ్లోబ్ మాస్టర్'


భారత వాయుసేన అమ్ములపొదిలో మరో కొత్త విమానం చేరింది. అయితే, ఇది యుద్ధ విమానం కాదు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రవాణా విమానం. వాయుసేనలో ఈ భారీ లోహ విహంగం చేరిక వ్యూహాత్మకంగా ఎంతో పెద్ద ముందడగు అని విశ్లేషకులంటున్నారు. ఈ సి-17 గ్లోబ్ మాస్టర్-3ని రూపొందించింది.. ప్రఖ్యాత విమాన తయారీదారు 'బోయింగ్' సంస్థ కావడం విశేషం. కాగా, ఇలాంటి బహుళ ప్రయోజనకారి విమానం కోసం తాము ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూశామని.. ఇన్నాళ్ళకు ఆరోజొచ్చిందని భారత ఎయిర్ వైస్ మార్షల్ ఎస్కే నాయర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి మరో 4.. 2014నాటికి మరో 5 సి-17 విమానాలను భారత వాయుసేనకు అందిస్తామని 'బోయింగ్' ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News