: చేతులు కాలాక 'పూజలు' చేస్తున్నారు!
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా.. ఈ దంపతుల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదేమో! ఎందుకంటే, ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర బట్టబయలైనప్పటి నుంచి అందరి నోళ్ళలోనూ నానుతున్నారు. బాలీవుడ్ లో ప్రతిభావంతురాలైన నటీమణిగా పేరున్న శిల్ప సైతం మ్యాచ్ పై పందాలు కాసిందని.. ఓ బుకీ వెల్లడించగా.. అదే బుకీ బయటపెట్టిన వివరాలతో రాజ్ కుంద్రాపై బీసీసీఐ వేటేసింది. దీంతో, ఈ భార్యాభర్తలిద్దరూ పాపహరణ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.
కుంద్రా హోమాలు నిర్వహిస్తుండగా.. శిల్ప మాత్రం తల్లి ఊరటవచనాలు వింటూ ఓదార్పు పొందుతోంది. నిన్న ముంబయిలో వీరి నివాసంలో 8 గంటల పాటు పూజ సాగిందట. ఇప్పటికే కుంద్రాను ఢిల్లీ పోలీసులు విచారించిన నేపథ్యంలో, తదనంతరం, ఎలాంటి కష్టనష్టాలు వాటిల్లకుండా ఉండేందుకే ఈ పూజ అని కుంద్రాగారు ట్వీటారు.