: గ్రామపంచాయతీల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం
మహిళాసాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలకు గ్రామపంచాయతీల్లో 50 శాతం స్థానాలను కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 21,590 గ్రామపంచాయతీల్లో మహిళలకు 10,795 పంచాయతీలను కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లోని మొత్తం 1,218 గ్రామపంచాయతీల్లో మహిళలకు 609 పంచాయతీలను కేటాయించారు. గరిజనేతర ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు 640, ఎస్సీ మహిళలకు 1,979 కేటాయించారు. బీసీ మహిళలకు 3,463 జనరల్ సీట్లలో మహిళలకు 4,104 సీట్లను కేటాయించారు.