: ఇప్పడు దాసరి, తరువాత చిరంజీవీ కావొచ్చు: మాజీ ఎంపీ కేపీ
బొగ్గుకుంభకోణం బయటపడడంతో ఇప్పడు దాసరి విచారణ ఎదుర్కోనున్నారని, భవిష్యత్తులో చిరంజీవి వంతు కూడా రావొచ్చనీ కాంగ్రెస్ మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్లకి రాజకీయాలు, ప్రజాసమస్యలపై అవగాహన తక్కువని, అందుకు దాసరి నారాయణరావు బొగ్గు స్కాంకు పాల్పడటమే నిదర్శనమన్నారు. సినిమా వారికి డబ్బు సంపాదన యావే తప్ప, ప్రజా సమస్యలు పట్టవని సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు సినిమా వారికి పార్టీలో టికెట్లివ్వవద్దని ఆయన పార్టీని కోరారు.