: సామాన్యులకో న్యాయం ... అమ్మగారి అల్లుడికో న్యాయం!
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూకేటాయింపుల వివరాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్ ను ప్రధాని కార్యాలయం తిరస్కరించింది. వాద్రా వివరాలు అత్యంత రహస్యమని, అందువల్ల ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని ఆ పిటీషన్ ను తోసిపుచ్చింది. గత కొద్ది కాలం క్రిందట ఇదే అంశంపై వివరాలు కావాలని అడిగితే న్యాయస్థానం పరిధిలోని అంశమంటూ తప్పించుకున్న పీఎంవో అధికారులు తాజాగా కోత్త వాదన వినిపిస్తున్నారు. వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. ఇతను సోనియా అల్లుడు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఉచితంగా భూములు లబ్దిగా పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే గతేడాది అరవింద్ కేజ్రివాల్ డీఎల్ఎఫ్, వాద్రాల భూఅక్రమాలను బయటపెట్టారు.