: డబ్బుకు చెదలు పట్టాయి ...!
ఏంటీ... నమ్మకం కలగలేదా... నిజమేనండీ... డబ్బుకి చెదలు పట్టాయి ... కొంత మొత్తాన్ని చక్కగా స్వాహా చేసేశాయి. అయితే, ఇది బ్యాంకులో మాత్రం కాదులెండి. ఒక మహిళ డబ్బును చెక్క సొరుగులో దాచుకుంది. దీంతో చక్కగా ఆ డబ్బును స్వాహా చేసేశాయి చెదలు.
చైనాలోని షుండేకు చెందిన ఒక వృద్ధురాలికి ఆమె పిల్లలు సుమారు రూ.37.83 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బును సదరు వృద్ధురాలు ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టి చెక్క సొరుగులో దాచుకుంది. ఒక ఆరు నెలల తర్వాత ఆ సొరుగు తెరచి చూడగానే అవాక్కవడం ఆమె వంతయింది. కవరులోని సొమ్ముకు చక్కగా చెదలు పట్టి వున్నాయి. దీంతో చేసేది లేక ఆమె అధికారులను ఆశ్రయించింది. విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది వచ్చి పరిశీలించగా అందులో రూ.32 లక్షలు బాగానే ఉన్నాయట, మిగిలిన 5.67 లక్షలను మాత్రమే చెద స్వాహా చేసిందట. అయినా డబ్బు బ్యాంకులో దాచుకుంటేనే సేఫ్గా ఉండడం కష్టంగా ఉన్న ప్రస్తుత కాలంలో కవరులో పెట్టి దాచుకుంటే ఉంటుందా... దొంగలు కాకున్నా... చెదలు చూడనే చూశాయికదా...!