: ఆ పర్వతం పేలాకే మనదేశంలోకి మనుషులొచ్చారట!


భారతదేశ ఉపఖండంలోకి మానవులు ఎలా వచ్చి ఉంటారు...? అందునా ఆఫ్రికా జాతికి చెందిన మానవులు మనదేశంలోకి ఎలా వచ్చి ఉంటారు...? ఇది చాలాకాలంగా మన శాస్త్రవేత్తలను వేధిస్తున్న అంశం. దీనిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. చివరికి ఒక ఆధారం కనిపెట్టారు...! సమత్రా దీవుల్లోని టోబా పర్వతం విస్ఫోటనం చెందిన తర్వాత అక్కడి మానవులు మనదేశంలోకి అడుగుపెట్టి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సమత్రా దీవుల్లోని టోబా పర్వతం సుమారు 74 వేల ఏళ్ల క్రితం విస్ఫోటనం చెందింది. అప్పటికి ఆఫ్రికా నుండి మనదేశంలోకి మానవులు అడుగుపెట్టలేదు. ఈ పర్వతం విస్ఫోటనం చెందిన తర్వాత భారీ స్థాయిలో బూడిద భారతదేశాన్ని ఆవరించింది. ఆ సమయంలో భారతదేశంలో ఆధునిక మానవులు ఉండిన దాఖలాలు లేవు. ఆ తర్వాతే మానవులు ఆ ప్రాంతానికి వచ్చారని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూకేలోని హడర్‌ఫీల్డ్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ రిచర్డ్స్‌ తెలిపారు. అంటే దక్షిణాసియా నుండి సుమారు 55 వేల సంవత్సరాలనుండి 60 వేల సంవత్సరాల మధ్యకాలంలో మానవుడు భారతదేశంలో కాలుమోపి ఉంటాడని శాస్త్రవేత్తల అంచనా. అయితే గతంలో వచ్చిన పరిశోధనల ఫలితాలు అంతకు ముందే ఈ ప్రాంతాల్లో మానవుల సంచారం ఉందని పేర్కొనడం వివేషం.

  • Loading...

More Telugu News