: నిర్భయ ఘటన తీవ్రంగా కలచి వేసింది: ప్రణబ్ ముఖర్జీ


ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని దేశ ప్రధమపౌరుడు ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. గత డిసెంబర్ 16న ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం దేశంలోని ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆ ఘటనలో మృతి చెందిన ధీరోదాత్త మహిళ జ్ఞాపకార్ధం దక్షిణ ఢిల్లీలోని జసోల వద్ద జాతీయ మహిళా సంఘం ఐదు అంతస్తుల ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. ఈ భవనానికి నిర్భయ అని నామకరణం చేసారు. ఈ భవనం స్త్రీలోని ధైర్యసాహసాలను వెలికి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న హింస పతనమవుతున్న మన నాగరిక విలువలకి నిదర్శనమన్నారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించలేని సమాజాన్ని నాగరిక సమాజంగా పరిగణించలేమన్నారు.

  • Loading...

More Telugu News