: చిన్నారులకు స్పార్క్ ల్యాబులు
చిన్నారులలో ఉన్న ఆసక్తికి పదును పెట్టేందుకు దేశంలో స్పార్క్ ల్యాబులు ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్స్ లెమన్ సన్ ముందుకు వచ్చింది. వచ్చే రెండేళ్లలో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో వీటి సంఖ్య 100కు పెంచాలని అనుకుంటున్నట్లు స్మిత్ సోనియన్స్ తెలిపింది. చిన్నారుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ల్యాబులు తోడ్పడతాయని పేర్కొంది. అమెరికాలో 6 నుంచి 12ఏళ్ల వయసులోపు విద్యార్థులకు సైన్స్, ఇంజనీరింగ్, చరిత్రకు సంబంధించిన అంశాలలో నైపుణ్యాన్ని అందించేందుకు స్మిత్ సోనియన్స్ కేంద్రాలు ఇప్పటికే కృషి చేస్తున్నాయి.