Rammohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

Prestigious Global Award for Union Minister Rammohan Naidu
  • యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మంత్రి
  • ప్రపంచవ్యాప్తంగా 50 మంది ఎంపిక
  • భారత్ నుంచి మొత్తం ఏడుగురికి అవార్డు
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు వరించింది. ‘ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్’ సంస్థ అవార్డుకు కేంద్ర మంత్రి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా.. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మరో ఆరుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేసిన 40 ఏళ్ల లోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్ సంస్థ అవార్డులతో సత్కరిస్తుంది.

అవార్డుకు ఎంపికైన భారతీయులు వీరే..
అనురాగ్ మాలూ- పర్వతారోహకుడు, వ్యవస్థాపకుడు & ఓరోఫైల్ వెంచర్స్ లో కీనోట్ స్పీకర్ 
రితేష్ అగర్వాల్- ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో
నిపున్ మల్హోత్రా- నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
అలోక్ మెడికేపుర అనిల్- నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, ఎండీ
కింజరాపు రామ్మోహన్ నాయుడు- భారత పౌర విమానయాన శాఖ మంత్రి
నటరాజన్ శంకర్- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ ఎండీ, భాగస్వామి 
మానసి సుబ్రమణ్యం- పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్
Rammohan Naidu
Kinjarapu Rammohan Naidu
Global Award
Young Global Leaders
Forum of Young Global Leaders
Indian Minister
Civil Aviation Minister
Telugu Desam Party
Award Winners
India

More Telugu News