Omar Abdullah: భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టు సూచన

Omar Abdullahs Divorce Petition Supreme Court Intervention
  • ఇరువురు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు
  • కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలం కావడంతో మరో అవకాశం ఇస్తున్నట్లు వ్యాఖ్య
  • మూడు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్న సుప్రీంకోర్టు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా విడాకుల విషయంలో పరస్పరం చర్చించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తన భార్య పాయల్‌తో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది.

దంపతులిద్దరూ తమ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైనప్పటికీ, దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరువురూ కూర్చొని తమ మధ్య వివాదానికి దారితీసిన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య గత కొన్నేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భార్య పాయల్‌తో విడాకులు కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Omar Abdullah
Payal Abdullah
Divorce Petition
Supreme Court of India
Jammu and Kashmir
Family Court
Delhi High Court
Indian Politics
Celebrity Divorce
Legal Case

More Telugu News