: 'కారు' పార్టీలోకి ఎర్రబెల్లి సోదరుడు!


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరేందుకు హక్కుంది. తండ్రి ఓ పార్టీలో, తనయుడు మరోపార్టీలో.. అన్న ఓ పార్టీలో, తమ్ముడు మరో పార్టీలో.. భర్త ఓ పార్టీకి మద్దతిస్తుంటే, భార్య మరో పార్టీకి జై కొడుతుంది. టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు కూడా ఈ కోవలోకే వస్తారు. దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో ప్రముఖుడైనా ప్రదీప్ రావు మాత్రం అన్న బాటను వీడాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈయన మరో రెండ్రోజుల్లో కారు పార్టీ అధినేత కేసీఆర్ ను కలవనుండడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఇక లాంఛనమే అంటున్నాయి రాజకీయవర్గాలు. ప్రదీప్ రావు ఎంట్రీకి ఇప్పటికే కేసీఆర్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News