: తెలంగాణ ప్రాంతంలో భారీ వర్ష సూచన
రుతుపవనాలు చురుగ్గా ఉండడం, ఉపరితల అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.