: జైలు నుంచి విడుదలైన అక్బరుద్దీన్
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎట్టకేలకు విడుదలయ్యారు. ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన అక్బర్ కు ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన విడుదల సందర్భంగా జైలు ఆవరణలో వారు సంబరాలు జరిపారు.
ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అక్బరుద్దీన్ ను పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆయన వచ్చే జాతీయ రహదారిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్బరుద్దీన్ ను హైదరాబాదులోని ఆయన నివాసానికి తరలిస్తున్నట్లు సమాచారం.