: ఛత్తీస్ గఢ్ లో పోలీస్ చెక్ పోస్టుపై దాడికి తెగబడ్డ మావోయిస్టులు


ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. గత నెలలో రాజకీయనాయకులే లక్ష్యంగా దాడి జరిపిన మావోలు ఈసారి పోలీసు చెక్ పోస్టునే లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. సుకుమా జిల్లా రామవరం పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడి చేసారు. అందుకు దీటుగా స్పందించిన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతున్నారు. రెండు వర్గాలమధ్య కాల్పులు జరుగుతున్నాయి. ప్రాణనష్టం సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. చీకటి పడుతుండగా అదను చూసిన మావోలు పోలీసు చెక్ పోస్టుపై దాడికి దిగారు. ప్రధానంగా ఆయుధాలు దొంగిలించేందుకు మావోలు పధకం పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసింది.

  • Loading...

More Telugu News