America: అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి!

Suspicious Death of A Young Man From Telangana in America
  • యూఎస్‌లో ఎంఎస్ చ‌దువుతున్న గంప ప్ర‌వీణ్
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్ర‌వీణ్ స్వస్థలం
  • ఉన్న‌త చ‌దువుల కోసం గ‌తేడాది అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి యువ‌కుడు
తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్ర‌వీణ్ (27) అనే యువ‌కుడు అమెరికాలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందాడు. గంప రాఘ‌వులు, గంప ర‌మాదేవీల కుమారుడైన ప్ర‌వీణ్ గ‌తేడాది ఎంఎస్ చేయ‌డానికి అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి వెళ్లాడు. అక్క‌డ ఎంఎస్ రెండ‌వ‌ సంవ‌త్స‌రం చ‌దువుతున్న అత‌డు.. స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. 

అయితే, అత‌డు నివాసం ఉండే ఇంటి స‌మీపంలో కాల్పులు చోటుచేసుకోగా వాటిలో ప్ర‌వీణ్ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
America
Telangana
Suspicious Death
Crime News

More Telugu News