: అద్వానీ లేని బీజేపీయా.. ఊహించలేకపోతున్నాం: శివసేన
భారతీయ జనతా పార్టీకి అగ్రనేత అద్వానీ రాజీనామా చేయడంపై శివసేన పార్టీ స్పందించింది. అద్వానీ లేని బీజేపీని ఊహించలేమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఏదేమైనా, అద్వానీ నిర్ణయం పట్ల విచారిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ముంబయిలో నేడు మాట్లాడుతూ.. బీజేపీకి అద్వానీ, వాజ్ పేయి చేసిన సేవలు నిరుపమానమని వ్యాఖ్యానించారు. ఎంతో అనుభవం ఉన్న రాజకీయవేత్తగా ఆయన అవసరం బీజేపీకి ఎంతైనా ఉందని ఆయన అన్నారు. రాజీనామా ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనను కోరతామని ఉద్ధవ్ చెప్పారు.