: ప్రియాంక చోప్రాకు పితృ వియోగం


బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తండ్రి డా. అశోక్ చోప్రా కన్నుమూశారు. 2008 నుంచి కేన్సర్ తో బాధపడుతున్న ఆయన నేడు ముంబయిలోని కోకిలా బెన్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత వారం రోజుల నుంచి అశోక్ చోప్రా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక షూటింగ్ పనులన్నింటిని పక్కనబెట్టి తండ్రి చెంతనే ఉంటోంది. ఇటీవలే తండ్రి ఆరోగ్యం కోసం ప్రియాంక 'మహామృత్యుంజయ పూజ' కూడా నిర్వహించింది. కానీ, విధి నిర్ధయగా ఆయనను బలితీసుకుని ప్రియాంక కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది.

  • Loading...

More Telugu News