Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Mohan Babu gets backlash in TG High Court

  • జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు
  • బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసిన హైకోర్టు

సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News