Redmi Note 13 Pro Plus: లక్కీ ఛాన్స్.. రెడ్‌మీ నోట్ 13 ప్రో+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
- 18 శాతం డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
- అసలు ధర రూ.27,988పై రూ.4000 తగ్గింపు
- అమెజాన్‌పై అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్
స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ‘రెడ్‌మీ’ భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేయబోతోంది. రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్లస్ ఫోన్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం సరసమైన ధరకే అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.27,998గా ఉండగా ఏకంగా 18 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే ప్రారంభ ధర రూ. 24,998కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్, పర్పుల్, వైట్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మూడు వేర్వేరు స్టోరేజీలు 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్ + 512జీబీ వేరియెంట్లలో లభ్యమవుతోంది.
నోట్ 13 ప్రో ప్లస్ ఫీచర్లు ఇవే
నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6.67 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, గీతలు పడకుండా డిస్‌ప్లేని డిజైన్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 200 ఎంపీ సామర్థ్యంతో ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16ఎంపీ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.