: పాకిస్తాన్ : కోర్టు నుంచి పరారైన ఎంపీ
హత్యాభియోగంపై అరెస్టయిన ఓ ఎంపీ కోర్టు నుంచి పారిపోయిన సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. గతనెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఎంపీ నవాబ్ హసన్ ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడని కేసు నమోదైంది. ఆ ఉదంతంలో హసన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతనికి సింధ్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఆ కేసు నేడు విచారణకు వచ్చింది. తాను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఈ కోర్టు కొట్టివేయడంతో భయపడిన ఎంపీగారు వెంటనే కాలికి పనిచెప్పారు. ఒక్కుదుటున కోర్టు హాలునుంచి బయటపడి పరుగు లంకించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రజాప్రతినిధి కోసం పాక్ పోలీసులు గాలింపు మొదలెట్టారు.